నేటి నుంచి దూరవిద్య డిగ్రీ పరీక్షలు | Distance learning degree examinations from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దూరవిద్య డిగ్రీ పరీక్షలు

Sep 3 2016 12:33 AM | Updated on Sep 26 2018 3:25 PM

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వీతీయ, తృతీయ సంవత్సర పరీక్షలు ఈనెల 3 నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 4 నుంచి పీజీ పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తంగా 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కేయూక్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వీతీయ, తృతీయ సంవత్సర పరీక్షలు ఈనెల 3 నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 4 నుంచి పీజీ పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తంగా 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 16,866 మంది, ద్వితీయ సంవత్సరంలో 12,994 మంది, తృతీయ సంవత్సర విద్యార్థులు 12,241 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పీజీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో  5,380 మంది, ఫైనల్‌ ఇయర్‌లో 4,637 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. పది స్పెషల్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement