పిడుగుపాటుకి ముగ్గురు మృత్యువాత | ౩ died in Adilabad after hit by lightening | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి ముగ్గురు మృత్యువాత

May 4 2016 9:23 PM | Updated on Aug 17 2018 2:53 PM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయూరు. ప్రమాదవశాత్తు మరొకరు మరణించారు.

ఆదిలాబాద్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయూరు. ప్రమాదవశాత్తు మరొకరు మరణించారు. లక్సెట్టిపేట, నేరడిగొండ, భైంసా, కుభీర్, జైనథ్, చెన్నూర్, బేల, కౌటాల మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. మండల కేంద్రమైన కుభీర్‌కు చెందిన రైతు ఠాగూర్ మహేందర్‌సింగ్(36) తన పొలానికి ట్రాక్టర్‌పై డ్రైవర్ పుప్పాల పీరాజీ(35)తో కలిసి వెళ్తుండగా వర్షం కురిసింది. దీంతో మామిడి చెట్టు కిందికి వెళ్లి ఆగారు. అంతలోనే పిడుగుపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. లక్సెట్టి పేట మండలం దౌడపల్లి గ్రామంలో గొర్రెల కాపరి రబ్బాని రవ(18) పిడుగుపాటుకు మంగళవారం సాయత్రం చనిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement