గిరిజన గూడాల్లో ప్రబలుతున్న అతిసారం | diarrhea in visakhapatnam agency area | Sakshi
Sakshi News home page

గిరిజన గూడాల్లో ప్రబలుతున్న అతిసారం

Jul 29 2016 8:29 AM | Updated on Sep 4 2017 6:57 AM

విశాఖపట్నం జిల్లా గిరిజన గూడాల్లో అతిసారం మహమ్మరి ప్రబలుతోంది.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా గిరిజన గూడాల్లో అతిసారం మహమ్మరి ప్రబలుతోంది. జిల్లాలోని హుకుంపేట మండలం అడ్డుమండకు చెందిన యువకుడు అతిసారం బారిన పడి పాడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది.

ఈ మధ్య కాలంలో నిమ్మలపాడులో అతిసారంతో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో సుమారు 20 మంది గిరిజనులు అతిసారం బారిన పడి బాధపడుతున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement