AP: ప్రబలిన డయేరియా.. 50 మందికి అస్వస్థత | Diarrhea Outbreak Hits Anakapalli Godicherla Village And Over 50 Affected, More Details Inside | Sakshi
Sakshi News home page

AP: ప్రబలిన డయేరియా.. 50 మందికి అస్వస్థత

Apr 25 2026 6:01 PM | Updated on Apr 25 2026 7:57 PM

Diarrhea Outbreak Hits Godicherla Village, Over 50 Affected

అనకాపల్లి: జిల్లాలో డయేరియా విజృంభించింది. నక్కపల్లి మండలం, గొడిచర్ల గ్రామంలో డయేరియా ప్రబలి 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ వాంతులు, విరేచనాలు అవుతుండడంతో గ్రామస్థలులు భయాందోళనలకు గురవుతున్నారు. పంచాయతీ కులాయి నీరు తాగిన కారణంగా డయేరియా వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. పలువురు డయేరియా బాధితులను గ్రామస్థులు పీహెచ్‌సీకి తరలించారు.

డయేరియా వచ్చినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో నీరు తగ్గిపోకుండా ఎక్కువ ద్రవాలు తాగాలి. పరిశుభ్రత పాటించాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. డయేరియా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఓఆర్‌ఎస్‌ తరచుగా తాగాలి. ఇది శరీరానికి నీరు, ఉప్పు తిరిగి అందిస్తుంది.  కొబ్బరి నీరు, సూప్, పల్చని పాలు, పండ్ల రసాలు ఉపయోగపడతాయి. కాఫీ, మద్యం, గ్యాస్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement