డయేరియాతో ఇద్దరి మృతి | Andhra Pradesh: Two Dead Due to Diarrhea | Sakshi
Sakshi News home page

డయేరియాతో ఇద్దరి మృతి

Jun 5 2026 4:57 AM | Updated on Jun 5 2026 4:57 AM

Andhra Pradesh: Two Dead Due to Diarrhea

చికిత్స పొందుతున్న మరో 30 మంది  

శ్రీకాకుళం: శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న సింగుపురం గ్రామంలో డయేరియా విజృంభించింది. డయేరియా బారిన పడి వారం కిందట కొన్ని గోపి(55)అనే వ్యక్తి మృతి చెందగా, బుధవారం బెలమాన బైరాగి (50) అనే వ్యక్తి వాంతులు, విరేచనాలతో మృతిచెందడం గ్రామస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

మరో 30 మంది వరకు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత వ్యవహారం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గ్రామంలో కనీసం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయకపోవడంపై సింగుపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement