డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆయన డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 18 ఫోన్ కాల్స్ వచ్చాయి.
డయల్ యువర్ జేసీకి 18 ఫిర్యాదులు
Sep 3 2016 11:16 PM | Updated on Sep 4 2017 12:09 PM
కాకినాడ సిటీ:
డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆయన డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 18 ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలో భూ సర్వే, రేషన్ కార్డులు, రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలకు జేసీ నేరుగా సమాధానమిచ్చారు. పెద్దింటి వారిపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని అంబాజీపేట మండలం కె.పెదపూడి నుంచి రాజారావు ఫిర్యాదు చేశారు. కొత్తపేట మండలం బిళ్ళకుర్రు నుంచి గొలకోటి విష్ణుమోహన్‌రావు తన భూమి సర్వే నంబర్ 282/4 ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిందిగా దరఖాస్తు చేసినప్పటికీ ఇంతవరూ ఆన్‌లైన్‌లో నమోదుకాలేదని ఫిర్యాదు చేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం నుంచి బొతు శ్యామలాదేవి మాట్లాడుతూ ఇళ్ళ స్థలం ఇచ్చారుగాని, పట్టా ఇవ్వలేదని, ఆ స్థలంలో పాక వేసుకుంటే తొలగించారన్నారు. డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, సర్వే ఏడీ నూతన్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement