జింక మృత్యువాత | deer killed | Sakshi
Sakshi News home page

జింక మృత్యువాత

Mar 29 2017 10:26 PM | Updated on Aug 30 2018 4:10 PM

జింక మృత్యువాత - Sakshi

జింక మృత్యువాత

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కల్వటాల–కొలిమిగుండ్ల గ్రామాల మధ్యన పుల్లారెడ్డి పాలిష్‌ ప్యాక్టరీ వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జింక మృత్యువాత పడింది.

 కొలిమిగుండ్ల :  గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కల్వటాల–కొలిమిగుండ్ల గ్రామాల మధ్యన పుల్లారెడ్డి పాలిష్‌ ప్యాక్టరీ వద్ద  ప్రధాన రహదారిపై బుధవారం జింక మృత్యువాత పడింది. మండలంలో వందల సంఖ్యలో జింకలు ఉన్నాయి. వేసవిలో నీటి కోసం కొండల్లో కిలోమీటర్ల పాటు కలియతిరిగినా చుక్క నీరు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో తెల్లవారు జామున నీటి కోసం  ప్రధాన రహదారి దాటుతూ రోడ్డు ప్రమాదంతో జింక మృతి చెందింది.  ఏఎస్‌ఐ ఉస్మాన్‌ఘని సంఘటన స్థలాన్ని పరిశీలించి.. అవుకు ఫారెస్ట్‌ అధికారులకు విషయాన్ని తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement