వాహనం ఢీకొని జింక మృతి | deer dies of road accident | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి

Feb 16 2017 10:32 PM | Updated on Aug 30 2018 4:10 PM

వాహనం ఢీకొని జింక మృతి - Sakshi

వాహనం ఢీకొని జింక మృతి

యర్రకొండ నర్సరీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక గురువారం మృతి చెందింది.

చిలమత్తూరు : యర్రకొండ నర్సరీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక గురువారం మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎఫ్‌బీఓ జి.అనిల్‌కుమార్‌, పశువైద్యాధికారి శివశంకర్‌నాయక్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఈ సందర్భంగా ఫారెస్టు సెక‌్షన్‌ ఆఫీసర్‌ మదన్‌మోహన్‌ మాట్లాడుతూ బ్రహ్మేశ్వరంపల్లి నుంచి కాపుచెన్నంపల్లి వరకు యర్రకొండ అటవీ ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా వెళ్లాలని కోరారు. నీటి కోసం వన్యప్రాణులు రోడ్డు దాటుతుంటాయని అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement