కత్తులతో దాడి.. దంపతుల దారుణహత్య | couples muedered in knife attack by unknown | Sakshi
Sakshi News home page

కత్తులతో దాడి.. దంపతుల దారుణహత్య

Mar 29 2016 8:15 AM | Updated on Jul 10 2019 8:02 PM

కత్తులతో దాడి.. దంపతుల దారుణహత్య - Sakshi

కత్తులతో దాడి.. దంపతుల దారుణహత్య

వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో సోమవారం అర్థరాత్రి దారుణం జరిగింది. నిద్రిస్తున్న దంపతులను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు.

మైదుకూరు(వైఎస్సార్): వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో సోమవారం అర్థరాత్రి దారుణం జరిగింది. నిద్రిస్తున్న దంపతులను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. సాయినాథపురంలోని ఎల్లమ్మ వీధిలో పాత దుస్తుల వ్యాపారం చేసుకునే అయ్యవారయ్య(41) కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి అయ్యవారయ్య, ఆయన భార్య నాగులు(35) భవనం పైఅంతస్తులో నిద్రించారు. రాత్రి 1.30 గంటల తర్వాత గుర్తుతెలియని దుండగులు వారిపై గొడ్డలి, కత్తులతో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన దంపతులు కేకలు వేయటంతో కుటుంబసభ్యులు పై అంతస్తుకు చేరుకున్నారు. వారు అక్కడికి రాగానే దుండగులు పరారయ్యారు. తీవ్రంగా రక్తస్రావం కావటంతో ఆస్పత్రికి తరలించేలోగానే ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. తమ బంధువులు నర్సింహులు, అతని కుమారుడు శ్రీను తమ అమ్మానాన్నలను చంపేసి, పారిపోతుండగా తాను చూశానని అయ్యవారయ్య కుమార్తె చెబుతోంది. కుటుంబ తగాదాల కారణంగానే మృతుని తండ్రి పెద్ద నర్సింహులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ రామకృష్ణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement