విద్యుత్‌షాక్‌తో దంపతుల మృతి | couple killed with current shak | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో దంపతుల మృతి

Sep 12 2016 12:43 AM | Updated on Jul 10 2019 8:00 PM

గోవిందరావుపేట : విద్యుత్‌ షాక్‌తో భార్యాభర్తలు మృతిచెందిన ఘటన వరంగల్‌ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పయ్యావుల సంతోష్‌(28), రాణి(25) దంపతులకు మూడేళ్లక్రితం వివాహమైంది.

ఇద్దరూ కష్టం చేసుకుంటూ జీవిస్తున్నారు. పనికి వెళ్లి ఇంటికి వచ్చాన స్నానానికి వేడినీళ్ల కోసం రాణి బకెట్‌లో హీటర్‌ పెట్టింది. బకెట్‌ కింద పెట్టిన పీట కదలడంతో షాక్‌తో ఆమె కాలు కాలిపోయింది. భార్య పరిస్థితి చూసి ఏమైందో తెలియక ఆమెను పట్టుకున్న భర్త కూడా షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.  

Advertisement
 
Advertisement
Advertisement