గురుకుల ‘డిగ్రీ’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ | Counseling to Gurukul 'degree' Admission | Sakshi
Sakshi News home page

గురుకుల ‘డిగ్రీ’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

Jul 23 2016 10:11 PM | Updated on Sep 4 2017 5:54 AM

గురుకుల ‘డిగ్రీ’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

గురుకుల ‘డిగ్రీ’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థినులకు మండలంలోని ధర్మారం(బి)గురుకుల కళాశాలలో శనివారం జిల్లా కో–ఆర్డినేటర్‌ జె.సాయినాథ్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

డిచ్‌పల్లి: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థినులకు మండలంలోని ధర్మారం(బి)గురుకుల కళాశాలలో శనివారం జిల్లా కో–ఆర్డినేటర్‌ జె.సాయినాథ్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా రిజర్వేషన్‌ ప్రకారం సీట్లు కేటాయించినట్లు సాయినాథ్‌ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్‌లలో ప్రారంభం కానున్న నూతన డిగ్రీ కళాశాలల్లో ఏడు కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం సొంత భవనాలు లేనందున దోమకొండలోని గురుకుల కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్‌లో అసిస్టెంట్‌ కో–ఆర్డినేటర్‌ పూర్ణచందర్‌రావు, ఆయాlగురుకుల కళాశాలల ప్రిన్సిపాల్‌లు సి.సింధు, సరోజిని దేవి నాయుడు, సంగీత, వి.శోభారాణి, తులసీదాస్, ఆంజనేయులు, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement