కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముప్పన కన్నుమూత | congress leader muppana dead | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముప్పన కన్నుమూత

Oct 8 2016 7:41 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు ముప్పన సోమరాజు (పెద్దబ్బాయి)(72) శనివారం తుదిశ్వాస విడిచారు. 1987లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. 1987, 95, 2005లో కౌన్సిలర్‌గాను, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌గా, మహారాణి సత్రం వైస్‌ చైర్మన్‌గా కొనసాగారు. 1990 నుంచి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

పెద్దాపురం : 
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు ముప్పన సోమరాజు (పెద్దబ్బాయి)(72) శనివారం తుదిశ్వాస విడిచారు. 1987లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. 1987, 95, 2005లో కౌన్సిలర్‌గాను, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌గా, మహారాణి సత్రం వైస్‌ చైర్మన్‌గా కొనసాగారు. 1990 నుంచి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆయన మరణ వార్త విన్న కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు పెద్దబ్బాయి తనయుడు సతీష్‌కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు పలువురు ప్రముఖులు పెద్దబ్బాయి మృతికి సంతాపం తెలిపి, కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement