breaking news
muppana
-
జీవితమే ఒక నాటకం అందులో నా వీడియోస్ పెద్ద బూటకం
అరసవల్లి: శ్రీకాకుళం యాసే తమకు గుర్తింపునిచ్చిందని ప్రముఖ రీల్స్ స్టార్స్ ముప్పన శ్రీనివాస్, రమణమ్మ దంపతులు అన్నారు. ఫ్యామిలీలో జరుగుతున్న పలు ఆసక్తికరమైన, హాస్యపరమైన సంభాషణలను మన శ్రీకాకుళం యాసలోనే రీల్స్ చేస్తూ ‘సూపర్ శ్రీనివాస్’ పేరుతో నలుగురినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మాఘమాసం ఆదివారం పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. నవ్వించడమే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా గత ఆరేళ్లుగా రీల్స్ చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు తమను గుర్తించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం తలగాం గ్రామమని, తన భార్య రమణమ్మది వీరఘట్టం మండలంలోని బిటివాడ అని శ్రీనివాస్ తెలిపారు. View this post on Instagram A post shared by Sreenivas.Muppana (@supersreenivas) View this post on Instagram A post shared by Sreenivas.Muppana (@supersreenivas) -
కాంగ్రెస్ సీనియర్ నేత ముప్పన కన్నుమూత
పెద్దాపురం : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు ముప్పన సోమరాజు (పెద్దబ్బాయి)(72) శనివారం తుదిశ్వాస విడిచారు. 1987లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 1987, 95, 2005లో కౌన్సిలర్‌గాను, ఏఎంసీ వైస్ చైర్మన్‌గా, మహారాణి సత్రం వైస్ చైర్మన్‌గా కొనసాగారు. 1990 నుంచి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆయన మరణ వార్త విన్న కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు పెద్దబ్బాయి తనయుడు సతీష్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు పలువురు ప్రముఖులు పెద్దబ్బాయి మృతికి సంతాపం తెలిపి, కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.


