సినిమా థియేటర్‌లో ఘర్షణ | Confrontation in the movie theater | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్‌లో ఘర్షణ

Jun 27 2017 10:50 AM | Updated on Aug 9 2018 7:30 PM

సినిమా థియేటర్‌లో జరిగిన చిన్న ఘర్షణ తీవ్రమై ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.

నంద్యాల : సినిమా థియేటర్‌లో జరిగిన చిన్న ఘర్షణ తీవ్రమై ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి శ్రీనివాస సెంటర్‌ సమీపంలోని ఓ థియేటర్‌లో చోటు చేసుకుంది. డీజే సినిమాను తిలకిస్తున్న అభిమానులు తెర సమీపంలో కాగితాలు చల్లుతుండగా థియేటర్‌ సిబ్బంది మందలించారు. అయినా అభిమానులు పట్టించుకోకుండా రెచ్చిపోవడంతో థియేటర్‌ సిబ్బంది దాడికి దిగారు.

థియేటర్‌కు చెందిన సుబ్బరాయుడు, రఫీ ఆగ్రహంతో నడిగడ్డ ప్రాంతానికి చెందిన రెహమాన్, సమీర్, అరబాబర్‌లను కత్తులతో పొడిచారు. వెంటనే పోలీసులు వీరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement