బలవంతపు భూసేకరణ మానుకోవాలి | Compelling Land acquisition Stop | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణ మానుకోవాలి

Oct 1 2016 12:23 AM | Updated on Sep 4 2017 3:39 PM

టెక్స్‌టైల్‌ పార్కుపేరుతో జిల్లాలో పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టే బలవంతపు భూసేకరణ మానుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి వాసుదేవరెడ్డి హెచ్చరించారు.

  • ఏఐకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి
  • న్యూశాయంపేట : టెక్స్‌టైల్‌ పార్కుపేరుతో జిల్లాలో పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టే బలవంతపు భూసేకరణ మానుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి వాసుదేవరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం కార్యాలయంలో రైతు సంఘం రాష్ట్ర నా యకులు మోర్తాల చందర్‌రావు, కూసం రా జ మౌళిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవరిస్తూ రైతుల్ని కూలను నిరాశ్రయుల్ని చేయుటకు భూముల్ని లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి జిల్లాలో వేలాది ఎకరాలు బీడుగా ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా రెండు పంటలు పండే సారవంతమైన భూముల సేకరణకు పూనుకోవడం అన్యాయమన్నారు.  గీసుకొం డ, సంగెం మండలాల్లోని రైతుల్ని మభ్యపెడు తూ, వినకపోతే భయపెడుతూ అంగీకార ప త్రాలపై సంతకాలు చేయించుకోవడం దారుణమన్నారు.  న్యాయపరంగా 2013 చట్టం అమలయ్యేంత వరకు నిర్వాసితుల పక్షాన పో రాటం కొనసాగుతుందన్నారు. కౌలు రైతు సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దారపు రమేష్,  రం గయ్య, వీరన్న రవీందర్‌గౌడ్,  రాము, కుమారస్వామి, రాజన్న శ్రీనివాస్,  పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement