ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్‌ | cm kcr to farmhouse | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్‌

Aug 27 2016 8:53 PM | Updated on Jun 4 2019 5:16 PM

సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెదక్‌ జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

  • అభివృద్ధి పనులపై ఆరా
  • జగదేవ్‌పూర్‌: సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెదక్‌ జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి కాన్వాయ్‌ ద్వారా రోడ్డు మార్గాన ఫాంహౌస్‌కు వచ్చారు. సీఎం ఫాం హౌస్‌కు వస్తున్నారని సమాచారం ఉండడంతో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మార్గాన, ఫాంహౌస్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. వస్తూ రాగానే వర్షం బాగానే పడిందా? అంటూ ఫాంహౌస్‌ బాధ్యులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

    సాగులో ఉన్న బొప్పాయి పంటను పరిశీలించి పలు సూచనలు, సలహాలిచ్చినట్టు తెలిసింది. పాలీహౌస్‌ పనులను పరిశీలించారు. తన దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఆరా తీసినట్టు సమాచారం.  పంటలు ఎలా ఉన్నాయి?, ఇళ్ల పనులు ఎంత వరకు వచ్చాయి? తదితర అభివృద్ధి పనులపై అధికారులతో ఆరా తీసినట్టు తెలిసింది. సోమవారం వరకు ఇక్కడే ఉంటారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement