శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.81 కోట్లు | china venkanna profit 1.81 crores | Sakshi
Sakshi News home page

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.81 కోట్లు

Sep 1 2016 12:20 AM | Updated on Sep 4 2017 11:44 AM

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి హుండీల ద్వారా మంచి ఆదాయం సమకూరింది. గడచిన 27 రోజులకు గాను రూ.1.81 కోట్లు పైబడి ఆదాయం లభించింది. ఆలయ ఆవరణలో బుధవారం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి హుండీల ద్వారా మంచి ఆదాయం సమకూరింది. గడచిన 27 రోజులకు గాను రూ.1.81 కోట్లు పైబడి ఆదాయం లభించింది. ఆలయ ఆవరణలో బుధవారం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు  నడుమ ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్వామివారికి నగదు రూపేణా రూ.1,81,33,65 ఆదాయం లభించగా, భక్తుల కానుకలు రూపేణా 525 గ్రాముల బంగారం, అలాగే 5.939 కేజీల వెండి లభించినట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా అధికంగానే లభించినట్టు చెప్పారు.  
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1.11 లక్షల విరాళం 
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు బుధవారం రూ. 1,11,111ను విరాళంగా అందించారు. గణపవరం మండలం సరిపల్లికి చెందిన పెరుమాళ్ల శ్రీరామకృష్ణమూర్తి, సక్కూబాయ్‌ దంపతులు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కార్యాలయంలో ఈ విరాళాన్ని జమచేయగా దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు దాతకు బాండ్‌ పత్రాన్ని అందించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement