డెంగీతో చిన్నారి మృతి | child killed with Dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో చిన్నారి మృతి

Aug 2 2016 12:06 AM | Updated on Sep 4 2017 7:22 AM

బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామంలో దిలీప్, జ్యోతి దంపతుల కుమార్తె ద్రాక్షాయణి(4) డెంగీ జ్వరంతో సోమవారం మృతి చెందింది.

బొమ్మనహాళ్‌ (రాయదుర్గం) : 
బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామంలో దిలీప్, జ్యోతి దంపతుల కుమార్తె ద్రాక్షాయణి(4) డెంగీ జ్వరంతో సోమవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ద్రాక్షాయణి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు కణేకల్లు క్రాస్‌ లోని ఆర్డీటీలో ఆసుపత్రిలో చేర్చారు.
 
కోలుకోకపోవడంతో బళ్లారికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు బళ్లారిలోని స్వచ్ఛంద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ అని తేలింది. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో సోమవారం చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement