'బాబు పంచభూతాలను అమ్ముకుంటున్నారు' | chandrababu neglecting ap people | Sakshi
Sakshi News home page

'బాబు పంచభూతాలను అమ్ముకుంటున్నారు'

Nov 26 2015 6:33 PM | Updated on Mar 18 2019 9:02 PM

'బాబు పంచభూతాలను అమ్ముకుంటున్నారు' - Sakshi

'బాబు పంచభూతాలను అమ్ముకుంటున్నారు'

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచభూతాలను అమ్ముకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.

అనంతపురం: కరువు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపే తీరిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేదా అని కాంగ్రెస్ పార్టీ నేత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశ్నించారు.

వరదసాయం కింద తమిళనాడుకు రూ.వెయ్యి కోట్లు మంజూరు అయితే ఏపీకి చిల్లిగవ్వ కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. హంద్రీ-నీవా పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. చంద్రబాబు పంచభూతాలను అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement