చంద్రబాబుది ప్రచార ఆర్భాటం | chandrababu doing only publicity | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది ప్రచార ఆర్భాటం

Aug 14 2016 11:50 PM | Updated on Jul 28 2018 3:17 PM

చంద్రబాబుది ప్రచార ఆర్భాటం - Sakshi

చంద్రబాబుది ప్రచార ఆర్భాటం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి కోసం కాకుండా.. ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య ఆరోపించారు.

నెహ్రూనగర్‌(పగిడ్యాల): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి కోసం కాకుండా.. ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య ఆరోపించారు. ఆదివారం మండల నెహ్రూనగర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ నెరవేర్చాలన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని నియోజకవర్గాల్లో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో పుష్కర స్నానాలు చేయడం ఓ మధురానుభూతిని కలిగించిందన్నారు. గోకరాజు కుంటను విస్తరించిన బ్యాక్‌వాటర్‌ నీటిలో వేలమంది భక్తులు ఒకేసారి స్నానాలు చేసేందు సౌకర్యం ఉన్నా  ఘాట్‌ను మంజూరు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని.. పంటలు బాగా పండాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కృష్ణమ్మను వేడుకున్నామని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గోపాల్, రత్నం, చంద్రమోహన్, రామస్వామి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహ  పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement