దైవ దర్శనానికి వెళ్తుండగా.. | Chain snacing in Karimnagar | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్తుండగా..

Jun 22 2016 5:06 PM | Updated on Sep 4 2017 3:08 AM

కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో దైవ దర్శనానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

 కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో దైవ దర్శనానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేటకు చెందిన సులోచన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని అటునుంచి కొండగట్టుకు వస్తుండగా.. వీరిని అనుసరిస్తూ.. పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement