'చైన్ స్నాచర్ దొరికిపోయాడు' | chain snacher arrest by police with women alert | Sakshi
Sakshi News home page

'చైన్ స్నాచర్ దొరికిపోయాడు'

Oct 9 2015 10:24 PM | Updated on Aug 21 2018 5:52 PM

మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించిన దుండగుడి యత్నాన్ని ఆ మహిళ తిప్పికొట్టింది. అరుపులతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది.

హైదరాబాద్: మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించిన దుండగుడి యత్నాన్ని ఆ మహిళ తిప్పికొట్టింది. అరుపులతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. దీంతో వారు అతడిని పట్టుకుని కటకటాల పాలు చేశారు.ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్.ఐ. జయశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బౌద్ధనగర్‌కు చెందిన పి.శ్రీలక్ష్మి (37) ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి, కుమార్తెతో కలసి షాపింగ్ చేసుకుని నడిచి ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వారాసిగూడ ప్రాంతానికి చెందిన హమీద్ (21) ద్విచక్రవాహనంపై వచ్చి శ్రీలక్ష్మి మెడలోని బంగారు మంగళ సూత్రాన్ని గట్టిగా పట్టుకుని, తెంపేందుకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని ఆమె అడ్డుకుని, గట్టిగా కేకలు వేశారు. స్థానికులు అప్రమత్తమై వెంటనే హమీద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement