అలరించిన సంగీత కచేరి | Catering concert | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత కచేరి

Sep 27 2016 12:46 AM | Updated on Jun 1 2018 8:39 PM

సత్యసాయిని కీర్తిస్తూ ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు అనురాధ కృష్ణమూర్తి నిర్వహించిన సంగీత కచేరిభక్తులను అలరించింది. సోమవారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత అనురాధ కృష్ణమూర్తి బృందం సంగీత కచేరి నిర్వహించారు.

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయిని కీర్తిస్తూ ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు అనురాధ కృష్ణమూర్తి నిర్వహించిన సంగీత కచేరిభక్తులను అలరించింది. సోమవారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత అనురాధ కృష్ణమూర్తి బృందం సంగీత కచేరి నిర్వహించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతుల్లో సుమధుర సంగీత స్వరాలొకిస్తూ ఆమె నిర్వహించిన సంగీత కచేరితో సాయికుల్వంత్‌ సభా మందిరం మార్మోగింది. సత్యసాయిని, సర్వదేవతలను కీర్తిస్తూ ఆమె సంగీత కచేరి నిర్వహించారు. అనంతరం కళాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వారిని సత్యసాయి ట్రస్టు సభ్యులు సన్మానించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement