నలుగురి రైతులపై కేసు నమోదు | case on four farmers | Sakshi
Sakshi News home page

నలుగురి రైతులపై కేసు నమోదు

Feb 27 2017 11:23 PM | Updated on Oct 1 2018 2:09 PM

హంద్రీ ఇసుకాసురులకు అక్రమంగా సహకరించారనే కారణంతో నలుగురు రైతులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సోమ్లానాయక్‌ తెలిపారు.

కృష్ణగిరి: హంద్రీ ఇసుకాసురులకు అక్రమంగా సహకరించారనే కారణంతో నలుగురు రైతులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సోమ్లానాయక్‌ తెలిపారు. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బిడుగాళ్ల శివుడు, మండల పరిధిలోని ఎస్‌హెచ్‌ ఎర్రగుడి సర్పంచ్‌ సురేంద్రనాథరెడ్డి, మాజీ వీఆర్వో కుమారుడు సుధీర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు అనే రైతులు తమ పొలాల నుంచి హంద్రీలోకి ట్రాక్టర్లు వెళ్లడానికి దారులు ఇచ్చి సహకరించారని రెవెన్యూ అధికారుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement