అరటి తోట దగ్ధం | Burnt banana garden | Sakshi
Sakshi News home page

అరటి తోట దగ్ధం

Oct 22 2016 12:11 AM | Updated on Aug 28 2018 7:15 PM

వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర కమిటీ సభ్యుడు రేవరాజు శ్రీనివాసరాజుకు సంబంధించిన ఎకరా అరటి తోట శుక్రవారం అగ్ని ప్రమాదానికి గురైంది.

రాజంపేట: వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర కమిటీ సభ్యుడు రేవరాజు శ్రీనివాసరాజుకు సంబంధించిన ఎకరా అరటి తోట శుక్రవారం అగ్ని ప్రమాదానికి గురైంది. ఊటుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ తోట ఉంది. నాలుగు ఎకరాల్లో ఆయన తోట వేశారు. ఒక ఎకరా అగ్ని ప్రమాదానికి గురైంది. కాయలు అగ్ని కీలలకు కాలిపోయాయి. చెట్లు పనికి రాకుండా పోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో దాదాపు మూడు లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement