7న నిర్మాణ కార్మికుల సదస్సు | bulding workers conference | Sakshi
Sakshi News home page

7న నిర్మాణ కార్మికుల సదస్సు

Aug 3 2016 11:45 PM | Updated on Sep 4 2017 7:40 AM

కాకినాడ సిటీ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ రంగ కార్మికుల సదస్సు ఈ నెల 7న నిర్వహిస్తున్నట్టు సంఘ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్థానిక వేంకటేశ్వర నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో సదస్సు

కాకినాడ సిటీ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ రంగ కార్మికుల సదస్సు ఈ నెల 7న నిర్వహిస్తున్నట్టు సంఘ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్థానిక వేంకటేశ్వర నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను సమీకరించి రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ తిలక్‌వీధిలోని పైడా వెంకట చలపతి కల్యాణ మండపంలో జరిగే ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement