వివాహిత దారుణహత్య | brutal murder of a married | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణహత్య

Apr 18 2017 12:06 AM | Updated on Mar 28 2019 6:27 PM

వివాహిత దారుణహత్య - Sakshi

వివాహిత దారుణహత్య

అగళి మండలం ఆర్‌జీపల్లిలో ఆదివారం రాత్రి రంగమ్మ (35) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

అగళి (మడకశిర) : అగళి మండలం ఆర్‌జీపల్లిలో ఆదివారం రాత్రి రంగమ్మ (35) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగమ్మ, రామన్న దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రామన్న గొర్రెల కాపరి కాపరి కావడంతో గడ్డి, నీరుకోసం గొర్రెలను మైసూర్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇద్దరు కుమారులు బెంగళూరులో ఉపాధి కోసం వెళ్లారు. రంగమ్మ మాత్రమే ఇంటికి కాపలాగా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దుండగులు వచ్చి.. రంగమ్మను హత్య చేసి ఆమె చెవిలోని కమ్మలను దొంగిలించారు. బీరువా తాళం పగులగొట్టి దుస్తులను చిందరవందరగా పడేశారు. సోమవారం ఉదయం గ్రామస్తుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఐ దేవానంద్‌, ఎస్‌ఐ నాగన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బెంగళూరు నుంచి వచ్చిన కుమారుల ద్వారా వివరాలను సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement