పాలకొల్లు సెంట్రల్ : స్నేహితులతో గొడవ లేదా ఇంట్లో మందిలించారనే మనస్తాపంతో ఓ బాలుడు ఆత్మహత్మకు పాల్పడ్డాడు.
బాలుడి బలవన్మరణం
Sep 13 2016 1:47 AM | Updated on Jul 12 2019 3:02 PM
పాలకొల్లు సెంట్రల్ : స్నేహితులతో గొడవ లేదా ఇంట్లో మందిలించారనే మనస్తాపంతో ఓ బాలుడు ఆత్మహత్మకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. పాలకొల్లు ముచ్చర్లవారి పుంత రామయ్యహాల్ ప్రాంతానికి చెందిన కొయ్యే ఆనందబాబు (14) ఎంఎంకేఎన్‌ఎం హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లి ఖత్తర్‌లో ఉండటం, తండ్రి పట్టించుకోకపోవడంతో నానమ్మ వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం గ్రౌండ్‌కు వెళ్లి వాలీబాల్ ఆడాడు. అక్కడ స్నేహితులతో గొడవ జరిగింది. విషయం తెలిసిన మేనత్త మందలించడంతో మనస్తాపం చెందాడు. ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకున్నాడు. మృతుడి పెద్దమ్మ కొంకి విజయకుమారి ఫిర్యాదు మేరకు కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైటర్ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం పంచనామా చేశారు.
Advertisement


