సెల్‌ఫోన్ కొనివ్వలేదని బాలుని ఆత్మహత్య | boy dies for cellphone in kamareddy | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ కొనివ్వలేదని బాలుని ఆత్మహత్య

Dec 3 2016 4:17 PM | Updated on Jul 12 2019 3:02 PM

సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

కామారెడ్డి: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హాజీపూర్‌కు చెందిన మధు(16) అనే బాలుడు సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు.

అయితే వారు కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన మధు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement