విద్యుదాఘాతంతో బిహార్ విద్యార్థి మృతి | bihar student died in rangareddy district Vedic school | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో బిహార్ విద్యార్థి మృతి

Dec 13 2015 11:47 AM | Updated on Jul 18 2019 2:02 PM

రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ షాక్తో ఓ విద్యార్థి మృతిచెందగా..మరో విద్యార్థికి గాయాలయ్యాయి.

శామీర్‌పేట: రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ షాక్తో ఓ విద్యార్థి మృతిచెందగా..మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలో ఉన్న గురుకుల వేద పాఠశాలలో చోటుచేసుకుంది.

పాఠశాల ఆవరణలో ఉన్న ఓ సంపులో ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు స్నానానికి దిగారు.  వీరిద్దరికి ప్రమాదవశాత్తూ కరెంటుషాక్ తగలడంతో నవీన్ (15) అనే విద్యార్థి మరణించగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.  సంపునకు కరెంటు ఎలా సరఫరా అయిందనే విషయం తెలియరాలేదు. ప్రమాదానికి గురైన ఇద్దరు విద్యార్థులు బిహార్‌కు చెందినవారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement