టైర్ పగిలి ఆటో బోల్తా పడిన సంఘటనలో ఓ మహిళ కూలీ మృతిచెందగా మరో ఆరుగురు కూలీలు గాయాలపాలయ్యారు.
ఆటో బోల్తా.. మహిళ కూలీ మృతి
Dec 30 2016 10:58 PM | Updated on Apr 3 2019 7:53 PM
- ఆరుగురికి గాయాలు
పాములపాడు: టైర్ పగిలి ఆటో బోల్తా పడిన సంఘటనలో ఓ మహిళ కూలీ మృతిచెందగా మరో ఆరుగురు కూలీలు గాయాలపాలయ్యారు. మండలంలోని బానుముక్కల మలుపు నుంచి వేంపెంట గ్రామానికి వెళ్లే రహదారిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు వెళ్లడించారు. ఆత్మకూరుకు చెందిన 14మంది కూలీలు ఆటోలో పని నిమిత్తం వేంపెంటకు బయలుదేరారు. బానుముక్కల మలుపు వద్దకు చేరుకోగానే టైర్ పగలడంతో ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో హుసేన్‌బీ(40), ఉప్పరి గాలమ్మ, సబేరాదాబి, హసీనా, గోకారమ్మ, నసీమూన్, సహేరాబాను గాయపడ్డారు. వీరందరికీ ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు నిర్వహించి కర్నూలు తరలించారు. అక్కడ హుసేన్‌బీ కోలుకోలేక మృతి చెందింది. ఎస్‌ఐ సుధాకరరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


