మహానందికి 4న గవర్నర్‌ రాక..? | august 4th governor visits mahanandi | Sakshi
Sakshi News home page

మహానందికి 4న గవర్నర్‌ రాక..?

Aug 1 2016 12:46 AM | Updated on Sep 4 2017 7:13 AM

గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల 4న మహానందికి వస్తున్నట్లు దేవస్థానం కార్యాలయానికి సమాచారం అందింది.

మహానంది: గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల 4న మహానందికి వస్తున్నట్లు దేవస్థానం కార్యాలయానికి సమాచారం అందింది. పుష్కర ఏర్పాట్ల పరిశీలనకు వస్తున్న ఆయన శ్రీశైలం క్షేత్రానికి వెళ్తూ అహోబిలం క్షేత్రానికి వస్తారని, అక్కడ రాత్రి బస చేసి 4వ తేదీ ఉదయం మహానందికి చేరుకుని శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుంటారని సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement