అమెరికాలో బిక్కు బిక్కు | Attacks on indians in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో బిక్కు బిక్కు

Feb 27 2017 10:58 PM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికాలో బిక్కు బిక్కు - Sakshi

అమెరికాలో బిక్కు బిక్కు

అమెరికాలో మా మనవడు, మనవరాలు కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇటీవల ట్రంప్‌ విధానాలు చూసి భయందోళనకు గురవుతున్నారు.

► వరుస ఘటనలతో బెంబేలెతుత్తున్న ‘మనోళ్లు'
► ఆందోళనలో బాధిత కుటుంబీకులు  
► ఫోన్ లో క్షేమసమాచారం తెలుసుకుంటున్న వైనం


దాడులు అమానుషం..
ఎదులాపురం : అమెరికాలో మా మనవడు, మనవరాలు కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇటీవల ట్రంప్‌ విధానాలు చూసి భయందోళనకు గురవుతున్నారు. భారతీయుల్లో ప్రతిభ ఉంటేనే అమెరికాలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. అమెరికాలో ఉన్న ఎంతోమంది భారతీ యులు అమెరికా అభివృద్ధికి తో డ్పడుతున్నారు. అలాంటిది జాతి వివక్షతో దాడులు చేస్తున్నా పట్టిం చుకోకపోవడం సరైంది కాదు. అమెరికాలో ప్రతిభావంతులు లేకపోవడంతోనే మన దేశ పౌరులు అక్కడ ప్రతిభ కనబరుస్తున్నారు.
– రాంరెడ్డి, భుక్తాపూర్‌

ఆదిలాబాద్‌ : అమెరికాలోని కాన్సర్‌లో బుధవారం హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ఆ దేశపౌరుడు జాతి వివక్షతో కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్న సంఘటన ఇక్కడి వారిని కలవర పెడుతోంది. అమెరికాలో మనోళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులతో జిల్లా నుంచి అమెరికాలో ఉంటున్న వారి గురించి ఇక్కడి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలని, బయటకు ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

ఫోన్ లో మాట్లాడి భయందోళనకు గురికావద్దంటూ ధైర్యం చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన తర్వాత ఈ దాడులు మరింత పెరిగిపోయాయి. ట్రంప్‌ పాలసీతో భారతీయులకు అమెరికాలో రక్షణ లేకుండా పోతోంది. మత, జాతి, వివక్ష, వలస జీవులపై వ్యతిరేకతతో విద్వేష పూరిత దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ.. వలస జీవులు వెళ్లిపోవాలంటూ దాడులు, కాల్పులకు పాల్పడుతుండడంతో అమెరికాలో భారతీయులు భయంభయంగా ఉంటున్నారు. శ్రీనివాస్‌ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకుండా అక్కడి అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement