డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ విద్యారంగ వార్తా కథన పురస్కారాలు–2016 కోసం దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ వై. రామచంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
Mar 4 2017 12:41 AM | Updated on Oct 9 2018 6:34 PM
కర్నూలు సిటీ: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ విద్యారంగ వార్తా కథన పురస్కారాలు–2016 కోసం దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ వై. రామచంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1వ తేదీ 2016 నుంచి డిసెంబర్ నెల 31వ తేదీ 2016 వరకు విద్యారంగం మీద వివిధ పత్రికలు, టీవీ ఛానల్స్‌లలో ప్రసారాలు అయిన కథనాలకు ఈ అవార్డులు ఇస్తారని పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలుగు, ఇంగ్లిషు పత్రికలు, తెలుగు చానల్స్ విభాగాల్లో పురస్కారం కింద రూ.25 వేలు నగదు, జ్ఞాపికను ఇస్తారని, ఏ క్యాటగిరికి ఎంట్రీ పంపుతున్నారో స్పష్టంగా తెలిసేటట్లు కవరుపై రాయాలని సూచించారు.
Advertisement
Advertisement