ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం | AP Cabinet meeting starts in vijayawada | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

Jun 24 2016 12:24 PM | Updated on Jul 28 2018 3:33 PM

ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది.

విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో స్విస్ ఛాలెంజ్ ఫైల్ను ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. అలాగే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాను కూడా ఈ కేబినెట్ సమావేశంలో కట్టబెట్టనున్నట్లు తెలిసింది.

హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగుల తరలింపుపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో పలు విద్యాసంస్థలతోపాటు ఆస్పత్రులకు ప్రభుత్వం భారీగా భూములు కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోనుంది. రేషన్ డీలర్ల కమీషన్ పెంపునకు సంబంధించిన దస్త్రానికి కూడా ఆమోద ముద్ర వేయనుంది. ప్రైవేట్ రంగంలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటు... బిట్స్కు 200 ఎకరాలు...ఇండోయూకే మెడికల్ కాళాశాలకు... 150 ఎకరాల భూమిని కేబినెట్ కేటాయించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement