డిసెంబర్‌ 4న అమరావతి గోయింగ్‌ పింక్‌«థాన్‌ | amaravathi going pinkthan @ December 4th | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 4న అమరావతి గోయింగ్‌ పింక్‌«థాన్‌

Nov 9 2016 11:21 PM | Updated on Sep 4 2017 7:39 PM

డిసెంబర్‌ 4న అమరావతి గోయింగ్‌ పింక్‌«థాన్‌

డిసెంబర్‌ 4న అమరావతి గోయింగ్‌ పింక్‌«థాన్‌

మహిళల ఆరోగ్యం, రొమ్ము క్యాన్సర్‌ల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో డిసెంబర్‌ 4వ తేదీ అమరావతి గోయింగ్‌ పింక్‌థాన్‌ను నిర్వహించనున్నట్లు యునైటెడ్‌ సిస్టర్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మిలింద సోమన్‌ పేర్కొన్నారు.

విజయవాడ (లబ్బీపేట) : మహిళల ఆరోగ్యం, రొమ్ము క్యాన్సర్‌ల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో డిసెంబర్‌ 4వ తేదీ అమరావతి గోయింగ్‌ పింక్‌థాన్‌ను నిర్వహించనున్నట్లు యునైటెడ్‌ సిస్టర్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మిలింద సోమన్‌ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి ఈ పింక్‌థాన్‌ను మూడు కేటగిరీలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం మొగల్రాజపురంలోని ది ఫుడ్‌లాంజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి గోయింగ్‌ ఫింక్‌థాన్‌ వివరాలను వెల్లడించారు. యునైటెడ్‌ సిస్టర్స్‌ ఫౌండేషన్, ఎరెనా ఈవెంట్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పింక్‌థాన్‌లో పలు సంస్థలు భాగస్వాములు కానున్నట్లు వివరించారు. ఈ పింక్‌థాన్‌ 10 కి.మీ., 5 కి.మీ., 3 కి.మీ.లు ఇలా మూడు కేటగిరీలుగా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ పరుగులో 3 నుంచి 4 వేల మంది మహిళలు పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ మంజుభార్గవి, యునైటెడ్‌ సిస్టర్స్‌ ప్రతినిధి నీలిమ, డాక్టర్‌ శైలజ, రమేష్‌ హాస్పటల్స్‌కు చెందిన డాక్టర్‌ సుదర్శన్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement