మైదానంలో మెరికలు.. క్రీడారాణులు | active sports women | Sakshi
Sakshi News home page

మైదానంలో మెరికలు.. క్రీడారాణులు

Sep 19 2016 11:07 PM | Updated on Sep 4 2017 2:08 PM

మైదానంలో మెరికలు.. క్రీడారాణులు

మైదానంలో మెరికలు.. క్రీడారాణులు

పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆవరణలో సోమవారం అంతర్‌ కళాశాలల బాలికల గేమ్స్‌మీట్‌ ఉత్సాహభరి తంగా జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని 18 కళాశాలలకు చెందిన 300 మంది క్రీడాకారిణులు పోటీలకు హాజరయ్యా రు. అండర్‌–19 విభాగంలో కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, టెన్నికాయిట్, హేండ్‌బాల్‌ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులందించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీల

–అట్టహాసంగా అంతర్‌ కళాశాల బాలికల గేమ్స్‌ మీట్‌  
పోలసానిపల్లి (భీమడోలు): 
పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆవరణలో సోమవారం  అంతర్‌ కళాశాలల బాలికల గేమ్స్‌మీట్‌ ఉత్సాహభరి తంగా జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని 18 కళాశాలలకు చెందిన 300 మంది క్రీడాకారిణులు పోటీలకు హాజరయ్యా రు. అండర్‌–19 విభాగంలో కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, టెన్నికాయిట్, హేండ్‌బాల్‌ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులందించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. 
జాతీయస్థాయికి ఎదగాలి
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఏపీ వాలీబాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు జి.నారాయణరాజు అన్నారు. పోటీల ప్రా రంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. మంగళవారం నారాయణపురంలో స్పోర్ట్స్‌ మీ ట్‌ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రిన్సిపాల్‌ ఎంవీఎస్‌ఎస్‌కే సూర్యారావు, ఎంఈ వో గారపాటి ప్రకాశరావు, జిల్లా ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, రాష్ట్ర స్పోర్ట్స్‌ కో–ఆర్డినేటర్‌ రవీంద్ర, పీడీ అసోసియేషన్‌ అధ్యక్షుడు బీహెచ్‌ఎన్‌ తిలక్, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎ.ఇస్సాక్, కబడ్డీ అసోసియేషన్‌ ప్రిన్సిపాల్‌ కె.జయరాజ్, గేమ్స్‌ కన్వీనర్‌ కె.విజయలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
విజేతలు వీరే 
టెన్నికాయిట్‌ (సింగిల్స్‌) : కేవీ రాజ్యలక్ష్మి (ఎస్‌కేఎస్‌డీ, తణుకు), మాధురి (సెయింట్‌ థెరి స్సా, ఏలూరు).
టెన్నికాయిట్‌ (డబుల్స్‌) : ఎస్‌కేఎస్‌డీ, తణుకు, సెయింట్‌ థెరిస్సా, ఏలూరు జట్లు.
కబడ్డీ : పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల Mýళాశాల, ఏలూరు సెయింట్‌ థెరిస్సా జూనియర్‌ మహిళా కళాశాల జట్లు.
హేండ్‌బాల్‌ :  ఏలూరు సెయింట్‌ థెరిస్సా, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పోలసానిపల్లి జట్లు.
వాలీబాల్‌ : డీఎన్నార్‌ కళాశాల భీమవరం, ఎస్‌కేఎస్‌డీ కళాశాల తణుకు జట్లు.
ఖోఖో : కొవ్వూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల, పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement