breaking news
polasanipalli
-
భార్యను చంపి, ఉప్పు పాతరేసి..
భీమడోలు: భార్యను హత్య చేసి.. శవాన్ని ఇంటి ఆవరణలోనే ఉప్పు పాతరేశాడో భర్త. పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లిలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన విషయాన్ని నిందితుడు మద్యం మత్తులో నోరు జారడంతో ఆ నోటా ఈ నోటా గ్రామంలో వ్యాపించింది. దీంతో చేసేది లేక నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. అధికారులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసుల కథనం ప్రకారం.. పోలసానిపల్లి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ కోట శ్రీనివాసరావుకు పెదవేగి మండలం మొండూరులోని అక్క కూతురైన రామలక్ష్మితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భార్యపై అనుమానంతో శ్రీనివాసరావు తరచూ గొడవలు పడుతూ వేధిస్తుండేవాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యపై బలవంతంగా శారీరక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. శవానికి దుప్పటి చుట్టి మంచం కింద దాచేశాడు. ఉదయాన్నే ఇద్దరు పిల్లలను మొండూరులో అత్తగారింట్లో వదిలి వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన తమ్ముడు నాగరాజు, మరదలుకు పరిస్థితిని చెప్పాడు. వారి సహకారంతో తన ఇంటి ఆవరణలో నీటి ట్యాంకు నిర్మించేందుకని ఇద్దరు కూలీలతో ఏడు అడుగుల లోతు గోతిని తవ్వించాడు. అనంతరం మృతదేహాన్ని నిందితుడు శ్రీనివాసరావు గోతిలో పడేసి వాసన రాకుండా ఉప్పు పాతర వేశాడు. స్వతహాగా తాపీ మేస్త్రి కావడంతో రాళ్లు, బండలతో సిమెంట్ వేసి సమాధి కట్టేశాడు. గ్రామంలోని వారికి తన భార్య ఇల్లు వదిలి వెళ్లి పోయిందని ప్రచారం చేశాడు. రెండు రోజుల కిందట మద్యం మత్తులో భార్యను తానే చంపి పాతి పెట్టానని ఒకరిద్దరితో చెప్పాడు. అలా అందరికీ తెలిసిపోవడంతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గోతిలో పాతిపెట్టిన రామలక్ష్మి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మైదానంలో మెరికలు.. క్రీడారాణులు
–అట్టహాసంగా అంతర్ కళాశాల బాలికల గేమ్స్ మీట్ పోలసానిపల్లి (భీమడోలు): పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆవరణలో సోమవారం అంతర్ కళాశాలల బాలికల గేమ్స్‌మీట్ ఉత్సాహభరి తంగా జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 18 కళాశాలలకు చెందిన 300 మంది క్రీడాకారిణులు పోటీలకు హాజరయ్యా రు. అండర్–19 విభాగంలో కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, టెన్నికాయిట్, హేండ్‌బాల్ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులందించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జాతీయస్థాయికి ఎదగాలి గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఏపీ వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జి.నారాయణరాజు అన్నారు. పోటీల ప్రా రంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. మంగళవారం నారాయణపురంలో స్పోర్ట్స్ మీ ట్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రిన్సిపాల్ ఎంవీఎస్ఎస్కే సూర్యారావు, ఎంఈ వో గారపాటి ప్రకాశరావు, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, రాష్ట్ర స్పోర్ట్స్ కో–ఆర్డినేటర్ రవీంద్ర, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు బీహెచ్ఎన్ తిలక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.ఇస్సాక్, కబడ్డీ అసోసియేషన్ ప్రిన్సిపాల్ కె.జయరాజ్, గేమ్స్ కన్వీనర్ కె.విజయలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలు వీరే టెన్నికాయిట్ (సింగిల్స్) : కేవీ రాజ్యలక్ష్మి (ఎస్‌కేఎస్‌డీ, తణుకు), మాధురి (సెయింట్ థెరి స్సా, ఏలూరు). టెన్నికాయిట్ (డబుల్స్) : ఎస్‌కేఎస్‌డీ, తణుకు, సెయింట్ థెరిస్సా, ఏలూరు జట్లు. కబడ్డీ : పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల Mýళాశాల, ఏలూరు సెయింట్ థెరిస్సా జూనియర్ మహిళా కళాశాల జట్లు. హేండ్‌బాల్ : ఏలూరు సెయింట్ థెరిస్సా, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పోలసానిపల్లి జట్లు. వాలీబాల్ : డీఎన్నార్ కళాశాల భీమవరం, ఎస్‌కేఎస్‌డీ కళాశాల తణుకు జట్లు. ఖోఖో : కొవ్వూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల, పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.