తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు | accident in return journey | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు

May 15 2017 10:22 PM | Updated on Sep 5 2017 11:13 AM

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు

దేవరకు హాజరై తిరుగు ప్రయాణంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

గుడిపాడు (గూడూరు రూరల్‌): దేవరకు హాజరై తిరుగు ప్రయాణంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గుడిపాడు గ్రామంలో సోమవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మునగాలకు చెందిన చాకలి మద్దిలేటి (ఆటో డ్రైవర్‌), సురేష్‌ ఇద్దరూ బంధువులు. వీరు కర్నూలులో జీవిస్తున్నారు. మూడు రోజుల క్రితం గూడూరులో బం«ధువులు చేపట్టిన దేవర కార్యక్రమానికి ఇద్దరూ కుటుంబీకులతో హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం మద్దిలేటి ఆటోలో కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు.  మార్గమధ్యంలో గూడూరు మీదుగా మంత్రాలయం వెళ్తున్న ఎమ్మిగనూరు డిపో గుడిపాడు వద్ద ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి.
 
ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. చాకలి సురేష్‌ తలకు గాయమై అధిక రక్త స్రావం కావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృత్యువాతపడ్డాడు. మద్దిలేటి కాలు, చెయ్యి విరిగి తీవ్ర గాయాలపాలు కాగా,  ఏడు నెలల గర్భిణి అతని భార్య ఎల్లమ్మ తీవ్రంగా గాయపడి అపస్మాకరస్థితికి చేరుకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ పవన్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై స్థానికులను అడిగితెలుసుకున్నారు. మృతుడు సురేష్‌కు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement