ఎంఈఓ పోస్టుల భర్తీకి 9న కౌన్సెలింగ్‌ | 9th councelling of meo posts | Sakshi
Sakshi News home page

ఎంఈఓ పోస్టుల భర్తీకి 9న కౌన్సెలింగ్‌

Aug 3 2017 9:48 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లాలో ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టుల్లో అర్హులైన ప్రధానోపాధ్యాయులను బదిలీపై నియమించేందుకు ఈనెల 9న కడప ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టుల్లో అర్హులైన ప్రధానోపాధ్యాయులను బదిలీపై నియమించేందుకు ఈనెల 9న కడప ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకే ఆమోదించిన సీనియార్టీ జాబితా ప్రకారమే ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. సీరియల్‌ నంబరు 220 నుంచి (పాండరంగ) అర్హులైన హెచ్‌ఎంలు హాజరుకావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement