తొమ్మిది ఇసుక ట్రాక్టర్ల సీజ్‌ | 9 sand tractors seaz | Sakshi
Sakshi News home page

తొమ్మిది ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

May 25 2017 10:46 PM | Updated on Aug 28 2018 8:41 PM

తొమ్మిది ఇసుక ట్రాక్టర్ల సీజ్‌ - Sakshi

తొమ్మిది ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

రామగిరి మండలం పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు.

రామగిరి (రాప్తాడు) : రామగిరి మండలం పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ‘అడిగే వారెవరు? అడ్డంగా తోడేద్దాం’ శీర్షికన ఈ నెల 20న ప్రముఖంగా ప్రచురితమైన ‘సాక్షి’ కథనంపై పోలీసులు స్పందించారు. రామగిరి సీఐ యుగంధర్‌ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు పెన్నానదిలో ఇసుకను తోడి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లపై దాడులు నిర్వహించారు. తొమ్మిది ట్రాక్టర్లను పట్టుకుని సీజ్‌ చేశారు.వాటిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో ఏఎస్‌ఐ లోక్‌నాథ్, పోలీసులు మోహన్‌నాయక్, అల్తాఫ్‌. నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement