పసుపు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
రేపల్లె(గుంటూరు): పసుపు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన 9 మంది పసుపు రైతు కూలీలు ట్రాక్టర్‌పై పసుపు పంటను అమ్మడానికి వెల్లటూరు వెళ్తున్నారు.
ఈ సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.