Tractor turn
-
ట్రాక్టర్ బోల్తా.. 9 మందికి గాయాలు
రేపల్లె(గుంటూరు): పసుపు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన 9 మంది పసుపు రైతు కూలీలు ట్రాక్టర్‌పై పసుపు పంటను అమ్మడానికి వెల్లటూరు వెళ్తున్నారు. ఈ సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి, 17మందికి గాయాలు
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేట మండలం అప్పస్పల్లి సమీపంలో శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 17మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈసీఐఎల్ వద్ద ట్రాక్టర్ బోల్తా; ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: ఈసీఐఎల్ క్రాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ట్రాక్టర్ బోల్తాపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.