ఈసీఐఎల్ క్రాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్: ఈసీఐఎల్ క్రాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ట్రాక్టర్ బోల్తాపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.