లారీ - మినీ వ్యాన్ ఢీ: 25 మందికి గాయాలు | 25 people injured in road accident in west godavari district | Sakshi
Sakshi News home page

లారీ - మినీ వ్యాన్ ఢీ: 25 మందికి గాయాలు

Jul 26 2016 7:09 AM | Updated on Aug 30 2018 4:07 PM

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద లారీ - మినీ వ్యాను ఢీకొన్నాయి.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున లారీ - మినీ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement