ఆర్టీసీ బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు | 23 passengers injured in bus overturned in Karimnagar District | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు

Jul 21 2016 7:14 AM | Updated on Apr 7 2019 3:24 PM

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.

కరీంనగర్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇందిరానగర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా.. కొట్టింది. దీంతో బస్సులోని 23 మంది ప్రయాణికులకు తీవ్ర గాయపడ్డారు.

స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను అంబులెన్స్ల సాయంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రహదారిపై నుంచి బస్సును పక్కకు తొలగించి... ట్రాఫిక్ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సారయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement