14 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | 14 gamblers arrested in nalgonda district | Sakshi
Sakshi News home page

14 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Aug 14 2015 5:17 PM | Updated on Aug 20 2018 4:44 PM

పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

నల్లగొండ : పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దొతిగూడెం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్కి చెందిన 14 మంది యువకులు దొతిగూడెం గ్రామ సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో పోలీసులు కోళ్లఫారం వద్దకు చేరుకొని పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 29వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement