కారు ఢీకొని బాలుడి మృతి | 10years old boy dies in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని బాలుడి మృతి

Oct 16 2016 11:23 AM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని ఢీకొట్టింది.

కోదాడ (సూర్యాపేట) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

తొగర్రాయి గ్రామానికి చెందిన గీతేష్(10) రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement