100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం | 100 quintal pds rice seized in adilabad district | Sakshi
Sakshi News home page

100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Aug 17 2016 1:38 PM | Updated on Sep 4 2017 9:41 AM

ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

రేసిని రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement