డాక్టర్‌ లక్ష్మరెడ్డికి పదోన్నతి | డాక్టర్‌ లక్ష్మరెడ్డికి పదోన్నతి | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ లక్ష్మరెడ్డికి పదోన్నతి

Aug 3 2016 11:37 PM | Updated on Sep 4 2017 7:40 AM

డాక్టర్‌ లక్ష్మరెడ్డికి పదోన్నతి

డాక్టర్‌ లక్ష్మరెడ్డికి పదోన్నతి

జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి.లక్ష్మారెడ్డికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడిగా నియామకం
జిల్లా జేడీగా విక్రంకుమార్‌.. ఉత్తర్వులు జారీ
సాక్షి, సంగారెడ్డి:
జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి.లక్ష్మారెడ్డికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను ఆ శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో వరంగల్‌ జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ విక్రంకుమార్‌ను జిల్లాకు బదిలీ చేసింది. ఈక్రమంలో లక్ష్మారెడ్డి వచ్చేవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో పాల దిగుబడి పెంచేందుకు కృషి చేయటంతో పాటు కరువు కాలంలో పశువులకు మేత సమస్య రాకుండా లక్ష్మారెడ్డి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గోపాలమిత్ర సేవలను విస్తరింపజేసేందుకు కృషి చేశారు. తన సేవలను గుర్తించి ప్రభుత్వం పదోన్నతి కల్పించటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement